ఛందోగోపనములు

 

1. ఛందోగోపనం:  పట్టపగలు వెన్నెల విరిసెన్.

 

(మన సుకవి సినారె పాటలకు పగలే వెన్నెల అవుతుంది)

సెగలను జిమ్మెడి యెండల

జగమెరిగినకవి సినారె చల్లనిపాటల్

వగ బాపుచు మనమున సొం

పెగయన్ బురి పట్టపగలు వెన్నెల విరిసెన్.

 

2. ఛందోగోపనం:  వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్.

 

 (డాలస్ నగరంలోని నవవ్యాకరణ పాండితీమండితుడైన మరకతమారుతి)

హనుమా! మరకతగాత్రా!

ఘనమగు గగనాంగణమున ఖరకరు కరుణన్

వనముల వ్యాకృతి నేర్చిన

జననుత! వినుమ! స్తవనీయ! సత్కథలెల్లన్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి