నిషిద్ధాక్షరులు

 

1.   నిషిద్ధాక్షరి:  అంశము - కుచేలుని వృత్తాంతము. నిషిద్ధాక్షరములు - కకారము  లేకుండా. ఛందస్సు - మీ ఇష్టము.

 

(సర్వసద్గుణ ఘనుడు కుచేలుడు)

బహుళసంతానవంతుండు; భవ్యమూర్తి;

పేదవాడైన స్నేహాన పెద్దవాడు;

మౌని సాందీపనీఛాత్రమహితయశుడు;

శౌరిసఖుడు; సుదాముండు సద్గుణుండు. 

 

2.   నిషిద్ధాక్షరి:  అంశము శివధనుర్భంగము. నిషిద్ధాక్షరములు  శ-ష-స-హ. ఛందస్సు - మీ ఇష్టము.

 

(రఘురాముడు – శివధనుర్భంగం)

పార్వతీపతి ధనువును పట్టువిడక

నెందరెందరో భూనాథు లెక్కుపెట్ట

లేక మిన్నక నుండంగ, లేచి రాము

డెక్కుపెట్టగ పెళపెళ ముక్కలయ్యె.

 

3.   నిషిద్ధాక్షరి:  అంశము - సంక్రాంతి సంబరములు. నిషిద్ధాక్షరములు  శ-ష-స. ఛందస్సు - మీ ఇష్టము.

 

(పల్లెలో సంక్రాంతి)

గంగిరెద్దుల నాడించు రంగరాజు;

అక్కబావల నలరించు నమల, కమల;

వెచ్చదుప్పట్ల చలికాచు పెద్దజంట;

ఉత్తరాయణ కాలాన నొదిగినారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి